ట్రంప్‌పై మండిపడిన సీటెల్ మేయర్‌

Seattle Mayor Hits Back At Trump Go Back To Your Bunker - Sakshi

వాషింగ్టన్‌: సీటెల్‌ మేయర్‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్పై తీవ్ర విమర్శలు చేశారు. తిరిగి బంకర్‌లోకి వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు. సీహాజ్‌(క్యాపిటల్‌ హిల్‌ అటానమస్‌ జోన్‌)లో జోక్యం చేసుకుంటానంటూ ట్రంప్‌ చేసిన హెచ్చరికలపై స్పందిస్తూ.. సీటెల్‌ మేయర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ నరహత్యకు నిరసనగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. నిరసనకారులు రెచ్చిపోతుండటంతో వైట్‌ హౌస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. పరిస్థితులు చేయి దాటకముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రహస్య బంకర్‌లోకి తీసుకెళ్లారు.

ఈ సంఘటనను ఉద్దేశిస్తూ.. సీటెల్‌ మేయర్‌ ‘ట్రంప్‌ తిరిగి బంకర్‌లోకి వెళ్లు’ అంటూ వ్యాఖ్యానించాడు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ నరహత్య వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఆందోళనకారులు సీటెల్‌ను ఆక్రమించుకున్నారు. వారిని ట్రంప్‌ దేశీయ ఉగ్రవాదులు అని వ్యాఖ్యానించారు. నిరసనకారులను వెనక్కి పివలకపోతే సీహాజ్‌లో జోక్యం చేసుకుంటానంటూ మేయర్ జెన్నీ దుర్కాన్వా‌, షింగ్టన్ రాష్ట్ర గవర్నర్ జే ఇన్స్లీలను ట్రంప్‌ హెచ్చరించారు. (బంకర్‌ బాయ్‌)
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top