అమ్మాయి అని కూడా చూడకుండా..
కొందరు మహిళలు మరో యువతిని విచక్షణ రహితంగా కొట్టారు.
అన్హుయ్(చైనా): కొందరు మహిళలు మరో యువతిని విచక్షణ రహితంగా కొట్టారు. బట్టలు చింపుతూ ఇష్టమొచ్చినట్టు కొడుతూ ఆ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డు కూడా చేశారు. దీనికి సంబంధిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆ మహిళల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
తమ స్నేహితురాలి భర్తతో ఆ యువతి చనువుగా ఉంటున్నట్టు దాడికి దిగిన మహిళా గ్రూప్ ఆరోపించింది. నడి రోడ్డు అని కూడా చూడకుండా అందరూ చూస్తుండగానే ఆ యువతిని కొడుతూ, బట్టలు చింపుతూ, జుట్టుపట్టుకొని ఈడ్చుకుంటూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సంఘటన తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావీన్స్లో బొజ్హో ప్రాంతంలో చోటుచేసుకుంది. అక్కడున్న వారిలో ఓ మహిళ వచ్చి కల్పించుకొని యువతిని రక్షించడానికి ప్రయత్నించగా వారు అమెతో కూడా వాగ్వాదానికి దిగారు. మిగాతా వాళ్లు మాత్రం చూస్తూ ఉండిపోయారు. కొందరైతే ఈ తతంగాన్ని ఫోన్లతో రికార్డు చేస్తూ తమకు పట్టనట్టుగా వ్యవహరించారు.