నీ కంటే ఫ్రెండ్సే ఎక్కువ అందని... | Saudi groom reportedly files for divorce after bride won't get off her cell phone | Sakshi
Sakshi News home page

నీ కంటే ఫ్రెండ్సే ఎక్కువ అందని...

May 18 2016 3:30 PM | Updated on Aug 20 2018 7:33 PM

నీ కంటే ఫ్రెండ్సే ఎక్కువ అందని... - Sakshi

నీ కంటే ఫ్రెండ్సే ఎక్కువ అందని...

సెల్ ఫోన్ వదలడం లేదని సౌదీ అరేబియాలో భార్యకు విడాకులు ఇచ్చాడు భర్త.

సెల్ ఫోన్ వదలడం లేదని సౌదీ అరేబియాలో భార్యకు విడాకులు ఇచ్చాడు భర్త. పెళ్లి చేసుకున్న కొన్ని నిమిషాల్లోనే భర్త విడాకులు కోరారు. సెల్ ఫోన్ పిచ్చిలో పడి తనను పట్టించుకోవడం లేదన్న కారణంతో ఆమెను వద్దనుకున్నాడు. పెళ్లైన వెంటనే కొత్త దంపతులు హోటల్ కు వెళ్లారు. భార్యతో ప్రేమతో మాట్లాడదామని ప్రయత్నించిన భర్తకు ఆశాభంగం ఎదురైంది.

కొత్త పెళ్లి కూతురు సెల్ ఫోన్ లో మెసేజ్ లు టైప్ చేస్తూ బిజీ అయిపోయింది. పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ స్నేహితులు పంపిన సందేశాలకు రిప్లై ఇస్తూ, మెసేజ్ లు పెడుతూ పక్కనే భర్త ఉన్నాడన్న సంగతే మర్చిపోయింది. మెసేజ్ లు ఆపి తనతో మాట్లాడమని కోరిన భర్తపై ఒంటికాలిపై లేచింది. సెల్ ఫోన్ వదిలేది లేదని కచ్చితంగా చెప్పేసింది. 'నీ కంటే ఫ్రెండ్సే నాకు ఎక్కువ' అని నిక్కచ్చిగా చెప్పడంతో భర్త బిత్తరపోయాడు.

ఇలాంటి భార్య తనకు వద్దని విడాకులు కోరాడని గల్ఫ్ న్యూస్ వెల్లడించింది. కొత్తగా పెళ్లిచేసుకుని విడిపోతున్న జంటల సంఖ్య  పెరగడానికి ఈ ఉదంతం అద్దం పడుపడుతోందని న్యాయ నిపుణుడు ఒకరు తెలిపారు. అపార్థాలు, అభిప్రాయాలు కలవకపోవడం వంటి కారణాలతో ఎక్కువ మంది విడాకులు తీసుకుంటున్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement