
వాటికన్ సిటీ: కోవిడ్ మహమ్మారిపై పోరాటం చేస్తూ ప్రపంచమే లాక్‌డౌన్‌లో ఉన్న నేపథ్యంలో ఈస్టర్ వేడుకల సందడి ఎక్కడా కనిపించలేదు. ఇటలీ నుంచి పనామా వరకు చర్చిలన్నీ బోసిపోయి కనిపించాయి. ప్రజలందరూ ఇళ్లల్లో ఉండే ప్రార్థనలు చేసుకున్నారు. నిర్మానుష్యంగా ఉన్న సెయింట్ పీటర్ చర్చిలో పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా క్రైస్తవ సోదరుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ సోదరభావంతో ఒక్కటై కోవిడ్‌పై పోరాడాలని పిలుపునిచ్చారు. ‘‘ఇవాళ నా ఆలోచనలన్నీ కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న వారిపైనే ఉన్నాయి. ఎందరో ఈ మహమ్మారికి బలైపోయారు. తమ ప్రియమైన వ్యక్తుల్ని కోల్పోయారు’’అని అన్నారు.