బైక్పై ఐదుగురమ్మాయిల వీడియో హల్ చల్ | Police stopped motorbike carrying five girls | Sakshi
Sakshi News home page

బైక్పై ఐదుగురమ్మాయిల వీడియో హల్ చల్

Jun 25 2016 4:24 PM | Updated on Sep 4 2017 3:23 AM

బైక్పై ఐదుగురమ్మాయిల వీడియో హల్ చల్

బైక్పై ఐదుగురమ్మాయిల వీడియో హల్ చల్

ఒకే బైక్ పై ఐదుగురు అమ్మాయిలు రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

హెజోవ్(చైనా): ఒకే బైక్ పై ఐదుగురు అమ్మాయిలు రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దక్షిణ చైనాలోని హెజోవ్ నగరంలోని రోడ్లపై అమర్చిన సీసీకెమెరాల్లో ఐదుగురు అమ్మాయిలు బైక్ పై ప్రయాణిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.

అయితే వారు కొద్ది దూరం ప్రయాణించగానే పోలీసులకు చిక్కారు. ఐదురుగురిలో నలుగురు మైనర్లుగా పోలీసులు గుర్తించారు. బైక్ పై ఎక్కువ మంది కూర్చోవడమే కాకుండా డ్రైవింగ్ చేసిన అమ్మాయికి లైసెన్స్ కూడా లేదని పోలీసుల విచారణలో తేలింది. వర్షాలతో తడిగా ఉన్న రోడ్ల పై ఐదుగురు అమ్మాయిలు ప్రయాణించడమేంటని వీడియోని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement