రాజాసింగ్‌ మా సాంగ్‌ కాపీ కొట్టారు : పాక్‌ ఆర్మీ

Pakistan Army Claims BJP MLA Raja Singh Copied Their Song - Sakshi

హిందుస్తాన్‌ జిందాబాద్‌.. పాటను విడుదల చేసిన రాజా సింగ్‌

‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ పాటకు నకలంటున్న పాక్‌ ఆర్మీ

సాక్షి, హైదరాబాద్‌ : ‘హిందుస్తాన్‌ జిందాబాద్‌.. దిల్‌కీ అవాజ్‌.. హర్‌ దిల్‌కీ అవాజ్‌..’  పాటను గోషామహల్‌ ఎమ్మెల్యే, శ్రీరామ్‌ యువసేన భాగ్యనగర్‌ అధ్యక్షుడు టి.రాజాసింగ్‌ లోథా విడుదల చేసిన విషయం తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా ఈ పాటను తన అధికారిక ట్విటర్‌లో రాజాసింగ్‌ షేర్‌ చేశారు. ఈ పాటను భారత సైనికులకు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ పాటను రాజాసింగ్‌ కాపీ కొట్టారని పాక్‌ ఆర్మీ ఆరోపించింది. మార్చి 23 పాకిస్తాన్‌ డే సందర్భంగా తాము రూపొందించిన ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’  పాటకు కాపీనని పేర్కొంది. ఈ పాటను సహిర్‌ అలీ బగ్గా రాసారని తెలిపింది. ఈ పాటను కాపీ చేసినందుకు సంతోషంగా ఉందని, కానీ కాపీకి సంబంధించిన నిజాలు కూడా వెల్లడించాలి కదా! అని పాకిస్తాన్‌ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు రాజాసింగ్‌ పాడిన సాంగ్‌ను కూడా జతచేశారు. రాజా సింగ్‌.. ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌ ’  పాటను ‘హిందూస్తాన్‌ జిందాబాద్‌ ’ గా మార్చి భారత సైన్యానికి అంకితమిచ్చారని పాక్‌ స్థానిక మీడియా పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top