కరోనా భయం: సాయం కోరుతున్న ఉత్తర కొరియా!?

North Korea Secretly Seeking Help For Coronavirus Testing Report Says - Sakshi

ప్యాంగ్‌యాంగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచమంతా వణికిపోతున్నా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా నింపాదిగా ఉన్నారు. మహమ్మారి వ్యాపిస్తుందన్న విషయం బయటపడగానే సరిహద్దులను మూసివేసి.. అందరినీ ఇంట్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బయటకు వస్తే మరణమే శరణ్యం అనే పరిస్థితులు కల్పించారు. తద్వారా తమ దేశంలో అసలు కరోనా ప్రభావం లేదన్నట్లుగా క్షిపణులను ప్రయోగిస్తూ మీడియాకు ఫొటోలు విడుదల చేశారు. అయితే ఇదంతా నిన్నటి మాట. ప్రస్తుతం కరోనా మహమ్మారికి ఉత్తర కొరియా కొరియా కూడా భయపడుతోందట. ఏదేమైనా ముక్కుసూటిగా వెళ్లే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన స్టైల్‌ మార్చి పొరుగుదేశాల సహాయం కోరుతున్నారట. ముఖ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు, ఇతరత్రా వైద్య సదుపాయాలు సహా ఫేస్‌ మాస్కుల సరఫరా కోసం దాయాది దేశం దక్షిణ కొరియాను సంప్రదించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.(కరోనా: ఉత్తర కొరియా దుందుడుకు చర్య!)

కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటివరకు 24 వేల మందికి పైగా మృత్యువాత పడగా.. 5 లక్షలకు పైగా మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కేవలం ఉత్తర కొరియా మాత్రమే ఇంతవరకు తమ దేశంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని చెబుతోంది. అయితే మీడియా కథనాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కరోనా సోకి ఉత్తర కొరియా సైనికులు కొంతమంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కానీ కిమ్ ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తోంది. ‘‘ అదృష్టవశాత్తూ మా దేశంలో ఒక్కరికి కూడా కోవిడ్‌-19 సోకలేదు’’అని దేశ పారిశుద్ధ్య శాఖ బోర్డు అధికారి పాక్‌ మ్యాంగ్‌ సూ బుధవారం తెలిపారు.

ఇక చైనాలోని వుహాన్‌లో కరోనా లక్షణాలు బయటపడినాటి నుంచి కిమ్‌ సరిహద్దులను మూసివేయడంతో పాటుగా... కరోనా వ్యాప్తి చెందితే కఠిన చర్యలకు ఏమాత్రం వెనుకాడబోనని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తమ దేశ పౌరులతో పాటు విదేశీయులను కూడా ఎప్పటికప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నా.. అధికారులకు సహకరించాలని ఆదేశించారు. అంతేకాదు కరోనా లక్షణాలు బయటపడిన వ్యక్తిని కాల్చి చంపేయాల్సిందిగా ఆయన ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి.(కరోనా పేషెంట్‌’ను హతమార్చిన ఉత్తర కొరియా!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

29-03-2020
Mar 29, 2020, 20:58 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఏప్రిల్‌ 7 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 మంది తప్ప మిగిలిన కరోనా...
29-03-2020
Mar 29, 2020, 18:00 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలకు ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ శుభవార్త చెప్పారు. గతంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన...
29-03-2020
Mar 29, 2020, 16:51 IST
కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు రూ. 25 కోట్లు భారీ విరాళం ప్రకటించి అక్షయ్‌...
29-03-2020
Mar 29, 2020, 16:37 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19పై పోరాటానికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందుకొచ్చింది. ప్రధానమంత్రి సహాయనిధికి తమ వంతుగా రూ. 51...
29-03-2020
Mar 29, 2020, 15:26 IST
లండన్‌ : ప్రపంచ దేశాలపై కరోనా వైరస్‌ కరాళనృత్యం చేస్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ తన ఒడిలోకి చేర్చుకుంటోంది....
29-03-2020
Mar 29, 2020, 15:24 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ విజ్ఞప్తి చేశారు....
29-03-2020
Mar 29, 2020, 15:15 IST
లక్నో : కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌...
29-03-2020
Mar 29, 2020, 14:36 IST
న్యూఢిల్లీ/ హైదరాబాద్‌ : మన్ కీ బాత్‌లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ కరోనా పాజిటివ్‌ వచ్చిన తొలి తెలంగాణ యువకుడితో ఫోన్‌లో మాట్లాడారు....
29-03-2020
Mar 29, 2020, 14:29 IST
భార‌త మాజీ క్రికెట‌ర్‌ జోగింద‌ర్ శ‌ర్మ‌.. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డికి న‌డుం బిగించాడు. ఆయ‌న‌ సొంత రాష్ట్ర‌మైన హ‌ర్యాణాలో ఖాకీ...
29-03-2020
Mar 29, 2020, 14:28 IST
కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని కేంద్రం స్పష్టం చేసింది. ...
29-03-2020
Mar 29, 2020, 14:22 IST
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాల్లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 11 వరకే అనుమతిస్తున్నట్టు డిప్యూటీ సీఎం ఆళ్ల...
29-03-2020
Mar 29, 2020, 14:02 IST
హైదరాబాద్‌: కరోనా పోరులో ప్రపంచ దేశాల కంటే భారత్‌ ఎంతో ముందుందని తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు....
29-03-2020
Mar 29, 2020, 13:55 IST
కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో సెలబ్రెటీలు ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో తమకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. హీరోయిన్‌...
29-03-2020
Mar 29, 2020, 13:32 IST
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కరోనా వైరస్‌ (కోవిడ్‌–19 ) దెబ్బకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 19వ తేదీన ఒంగోలు...
29-03-2020
Mar 29, 2020, 13:08 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనావైరస్‌పై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఆదివారం కరోనా కేసు నమోదు కాలేదని...
29-03-2020
Mar 29, 2020, 13:06 IST
మహమ్మారి కరోనా కబంధ హస్తాల్లో చిక్కిన ప్రపంచ దేశాల జనం పిట్టల్లా రాలిపోతున్నారు.
29-03-2020
Mar 29, 2020, 12:45 IST
సాక్షి, నగరి : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పేద ప్రజలు తిండికి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
29-03-2020
Mar 29, 2020, 12:15 IST
కరోనా వైరస్‌ నియంత్రణకు 21రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడంతో సామాన్య జనం నుంచి ప్రముఖులు వరకూ ఇళ్లకే పరిమితం అయ్యారు....
29-03-2020
Mar 29, 2020, 12:14 IST
మహమ్మారి కరోనాకు స్పెయిన్‌ యువరాణి మారియా థెరీసా బలయ్యారు.
29-03-2020
Mar 29, 2020, 11:06 IST
చిన్నారి మరణంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఐడీపీహెచ్‌ డైరెక్టర్‌ ఎంగోజి ఎంజికె చెప్పారు.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top