క్యాట్‌ వాక్‌ కాదు స్పేస్‌ వాక్‌

Nasa astronauts Christina Koch and Jessica Meir in all-women spacewalk - Sakshi

ఆకాశం అచ్చంగా అతివలదే!

వాషింగ్టన్‌: ఆకాశంలో సగంగా కాదు. ఆకాశమంతటా తామేనని నిరూపించారు మహిళా వ్యోమగాములు క్రిస్టీనా కోచ్, జెస్సికా మియెర్‌లు. మునుపెన్నడూ ఎరుగని ఈ అనుభవాన్ని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం శుక్రవారం ఈ అనంతకోటి ప్రపంచానికి కనువిందు చేసింది. మొత్తంగా ఏడు గంటల 17 నిమిషాలపాటు  అంతరిక్షంలో గడిపి వీరిద్దరూ స్పేస్‌వాక్‌ విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్‌లో నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌కాల్‌ చేశారు. మహిళా వ్యోమగాములిద్దరినీ అభినందించారు. మీరిద్దరినీ చూసి అమెరికా గర్విస్తోందని ట్రంప్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.  

క్రిస్టీనా కోచ్, జెస్సికా మియెర్‌


54 ఏళ్లలో తొలిసారి అచ్చంగా మహిళా వ్యోమగాములు
పురుషులతోకలసి కాకుండా మహిళా వ్యోమగాములు మాత్రమే స్పేస్‌ వాక్‌ చేసిన తొలి సందర్భం ఇదే కావడం విశేషం. అర్ధశతాబ్దకాలానికిపైగా వ్యోమగాములు 420 సార్లు స్పేస్‌ వాక్‌ చేశారు. 421వ స్పేస్‌ వాక్‌ ఆసాంతం మహిళల సొంతం. ఇప్పటి వరకు మొత్తం 227 మంది వ్యోమగాములు స్పేస్‌ వాక్‌ చేస్తే, అందులో మహిళలు కేవలం 14 మందే. గతంలో స్పేస్‌ వాక్‌ చేసిన స్త్రీలంతా ఇతర పురుషులతో కలిసి చేసినవారే తప్ప ప్రత్యేకించి స్త్రీలే స్పేస్‌వాక్‌ చేసిన సందర్భం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.   

క్రిస్టినా కోచ్, జెస్సికా మియెర్‌
వ్యోమగాములు క్రిస్టినా కోచ్, జెస్సికా మియెర్‌లు ఈ చారిత్రక ఘటనలో పాలుపంచుకున్నారు. మార్చి నుంచి క్రిస్టినా కోచ్, ఫిబ్రవరి నుంచి జెస్సికా మియెర్‌ అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌ లో ఉన్నారు. అంతరిక్షంలో తేలుతూ ఈ ఇద్దరు మహిళలు గత వారాంతంలో స్పేస్‌ స్టేషన్‌ వెలుపల  నిరుపయోగంగా మారిన బ్యాటరీ చార్జర్‌ను మార్చారు. దీంతోపాటు ఇతరత్రా రిపేర్‌ల కోసం స్పేస్‌ స్టేషన్‌ వెలుపల ఏడుగంటల 17 నిమిషాలపాటు అంతరిక్షంలో గడిపారు. ఇప్పటి వరకు స్పేస్‌ వాక్‌లు జరిపిన వారిలో  జెస్సికా 228 వ వారు.  ప్రత్యేకించి మహిళా వ్యోమగాల స్పేస్‌ వాక్‌ నిజానికి ఆరు నెలల క్రితమే జరగాల్సి ఉంది. అయితే వ్యోమగాములకు సరిపోయే స్పేస్‌ సూట్‌ లేకపోవడం వల్ల స్సేస్‌ వాక్‌ ఆర్నెల్లు వాయిదాపడింది. ఇద్దరికి స్పేస్‌ సూట్‌ కావాల్సి ఉండగా ఒకే ఒక్క మధ్యతరహా కొలతలతో కూడిన స్పేస్‌ సూట్‌ అందుబాటులో ఉండడంతో ఇంతకాలం ఆగాల్సి వచ్చింది. వీరికోచ్‌ మెక్‌ క్లెయిన్‌ తిరిగి భూమిపైకి రావడంతో రెండో స్పేస్‌ సూట్‌ అంతరిక్ష పరి శోధనా కేంద్రానికి తీసుకెళ్ళడం సాధ్యమైంది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top