కిమ్‌ సోదరుడి డెడ్‌ బాడీ ఎక్కడ ఉందంటే.. | Malaysia says Kim Jong Nam's body still in the country | Sakshi
Sakshi News home page

కిమ్‌ సోదరుడి డెడ్‌ బాడీ ఎక్కడ ఉందంటే..

Mar 28 2017 11:39 AM | Updated on Jul 29 2019 5:39 PM

కిమ్‌ సోదరుడి డెడ్‌ బాడీ ఎక్కడ ఉందంటే.. - Sakshi

కిమ్‌ సోదరుడి డెడ్‌ బాడీ ఎక్కడ ఉందంటే..

హత్యకు గురైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరుడు కిమ జాంగ్‌ నామ్‌ మృతదేహం ఇప్పటికీ తమ వద్దే ఉందని మలేషియా ప్రభుత్వం స్పష్టం చేసింది.

కౌలాలంపూర్‌: హత్యకు గురైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరుడు కిమ జాంగ్‌ నామ్‌ మృతదేహం ఇప్పటికీ తమ వద్దే ఉందని మలేషియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా నామ్‌ శవాన్ని ప్యాంగ్‌ యాంగ్‌ పంపించి వేశారంటూ వచ్చిన వార్తల్ని మలేషియా మంత్రి సుబ్రమణ్యం సదాశివం ఖండించారు.

నామ్‌ మృతదేహానికి బహుశా అంత్యక్రియలు చేసి ఉంటారని, లేదా ప్యాంగ్‌యాంగ్‌ పంపించి ఉంటారని, అది కాదంటే ప్రస్తుతం ఆయన కుటుంబం ఉంటున్న మకావుకు తరలించి ఉంటారని మలేషియాతోపాటు పలు వార్తా సంస్థల్లో వివాదాస్పద వార్తా కథనాలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టతనిచ్చారు. ఇప్పటికీ ఇరు దేశాల ప్రయాణీకులపై నిషేధం కొనసాగుతుందని, పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని మంత్రి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement