వెంబడిస్తూ కాల్పులు.. భారీ దోపిడి

Makhado police manhunt for Cash intrasit Suspects - Sakshi

కేప్ టౌన్ : సినిమాల్లో ఛేజింగ్ సన్నివేశాలను తలపించేలా దక్షిణాఫ్రికాలో ఓ భారీ దోపిడి జరిగింది. భారీ మొత్తంలో నగదును తీసుకెళుతున్న ఓ వాహనంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. వ్యానుపై కాల్పులు జరుపుతూ వెంబడించారు. ముసినా నుంచి భారీ మొత్తంలో నగదును తీసుకెళుతున్న సెక్యురిటీ వ్యానును తొలుత ఓ వాహనం ఓవర్ టెక్ చేసింది. అనంతరం అందులోని ఓ దుండగుడు కాల్పులు జరపడం ప్రారంభించాడు. అదే సమయంలో వెనక వైపు నుంచి వస్తున్న మరో వాహనంలోని ఓ వ్యక్తి వ్యాను టైర్లను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపాడు. తూటాల నుంచి తప్పించే క్రమంలో హెన్డ్రిక్  వర్వుర్డ్ టన్నెల్ వద్ద వ్యాను అదుపుతప్పి బోల్తా కొట్టింది.

వ్యానులో డబ్బును సురక్షితంగా దాచిన ఇనుప బాక్స్ ని దుండగులు బాంబులతో పేల్చి డబ్బును దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఓ సెక్యురిటీ సిబ్బంది శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అయితే అతడికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. దుండగులు ఈ దాడికి తెలుపు రంగు టయోటా జీటీ6, నలుపు రంగు ఎం ఎల్ మెర్సిడిజ్ బెంజ్, తెలుపు రంగు మెర్సిడిజ్ బెంజ్ సెడాన్ తో పాటూ మరో నీలి రంగు వాహనాన్ని వాడినట్టు పోలీసులు గుర్తించారు. దుండగుల కోసం మకాడో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top