వెయిటింగ్ లిస్ట్లోనే 40 వేల మంది! | London's first naked restaurant opens this weekend with 40,000 people on the waiting list | Sakshi
Sakshi News home page

వెయిటింగ్ లిస్ట్లోనే 40 వేల మంది!

Jun 12 2016 4:06 PM | Updated on Oct 16 2018 8:38 PM

వెయిటింగ్ లిస్ట్లోనే 40 వేల మంది! - Sakshi

వెయిటింగ్ లిస్ట్లోనే 40 వేల మంది!

బ్రిటన్లోని లండన్లో గల బున్యాడి రెస్టారెంటు శనివారం ప్రారంభమైంది.

లండన్:
బ్రిటన్లోని లండన్లో గల బున్యాడి రెస్టారెంటు శనివారం ప్రారంభమైంది. తొలి రోజు 42 మంది బట్టల్లేకుండా భోజనాన్ని లాగించేశారు. అందులోకి ఎప్పుడు బట్టలు విప్పుకొని వెళ్లి లంచ్ చేద్దామా అని వేలమంది క్యూకట్టి ఎదురుచూస్తున్నారు. లండన్లో బున్యాది  రెస్టారెంటులోకి వచ్చేవారు దుస్తులన్నింటిని విప్పేసుకొని భోంచేసే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. అయితే, ఇందులో తీవ్ర నిరుత్సాహ పరిచే విషయం ఏమిటంటే.. ఈ రెస్టారెంటులో ఒకసారి 42 మాత్రమే కూర్చుని భోంచేసే అవకాశం ఉంది. దీంతో మొదటి 42మంది తప్ప మిగితా వారంతా క్యూ కట్టి ఎదురుచూడాల్సిందే. పోని ఇంకోసారి వద్దాంలే అనుకుని వెళ్లారో.. తిరిగొచ్చేవరకు మరో భారీ క్యూ వెనకాలే నిల్చోవడం కాయం. ఈ నేపథ్యంలో తమ వంతుకోసం ఎన్నిరోజులైనా పర్వాలేదనుకొని వేలమంది ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.

ఇలా 42మంది మాత్రమే బట్టలు విప్పేసుకొని భోంచేసే సామర్ధ్యం ఉన్న ఈ రెస్టారెంట్ కోసం ఇప్పటికే 40 వేలమందికి పైగా సైనప్ అయ్యారు. ఈ రెస్టారెంటును లాలిపాప్ అనే కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ రెస్టారెంటుకు వస్తున్న స్పందనను చూసి ఆ కంపెనీ యజమాని సెబ్ లియాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'బీచ్ ల్లాంటి ప్రదేశాల్లో.. స్నానం చేసే వేళల్లో ప్రజలు కాస్త సిగ్గుపడుతూనైనా నగ్నంగా మారిపోవాలని అనుకుంటారు. అలాంటిది స్వేచ్ఛగా నగ్నంగా మారేందుకు వీలు కల్పిస్తే సాధారణంగానే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు' అని ఆయన చెప్పారు.

అయితే, నగ్నంగా ఈ రెస్టారెంటుకు వచ్చిన వారికి వడ్డించే వారు మాత్రం అర్ధనగ్నంగా ఉంటారు. ఇందులో ఒకసారి భోంచేయాలంటే.. కనీసం ఏడువేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇందులో సెల్ఫీలవంటి వాటికి అనుమతించరు. ఇందులోకి ప్రవేశించే ముందే వారి ఎలక్ట్రానిక్ డివైస్లు అన్నీ కూడా రిసెప్షన్లో పెట్టి వెళ్లాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement