క్యాంపస్‌లో తుపాకులకు అనుమతి! | Guns allowed onto campus in Texas on same day victims of 1966 mass shooting are remembered | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌లో తుపాకులకు అనుమతి!

Aug 3 2016 11:30 AM | Updated on Sep 4 2017 7:40 AM

క్యాంపస్‌లో తుపాకులకు అనుమతి!

క్యాంపస్‌లో తుపాకులకు అనుమతి!

యూనివర్సిటీల్లోకి తుపాకులను అనుమతిస్తూ టెక్సాస్‌ ప్రభుత్వం వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది.

చికాగో: యూనివర్సిటీల్లోకి తుపాకులను అనుమతిస్తూ టెక్సాస్‌ ప్రభుత్వం వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో క్యాంపస్‌లోకి తుపాకులను అనుమతిస్తోన్న ఎనిమిదో రాష్ట్రంగా టెక్సాస్‌ నిలిచింది. 1966లో టెక్సాస్‌ యూనివర్సిటీలో తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన 50 ఏళ్ల తర్వాతా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

న్యాయవాదులతో పాటు యూనివర్సిటీకి చెందిన కొంతమంది ప్రొఫెసర్లు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల శాంతికి విఘాతం కలుగుతుందన్నది వారి ఆందోళన. ఈ విషయంపై డల్లాస్‌కి చెందిన ప్రొఫెసర్‌ సీమా యాస్మీన్‌ మాట్లాడుతూ...‘నేను తుపాకులను అనుమతించడానికి భయపడట్లేదు, కానీ విద్యార్థుల మానసిక స్థితి, పరీక్షల ఒత్తిడిలాంటి అంశాలు ఎలాంటి విపరీత పరిణామాలకు దారి తీస్తాయో అన్నదే ఆందోళన కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement