వైరల్ వీడియో: ఓంకారం విన్న పాప ఏం చేసింది? | father chants om, crying baby girl sleeps instantly | Sakshi
Sakshi News home page

వైరల్ వీడియో: ఓంకారం విన్న పాప ఏం చేసింది?

May 3 2017 8:15 AM | Updated on Sep 5 2017 10:19 AM

వైరల్ వీడియో: ఓంకారం విన్న పాప ఏం చేసింది?

వైరల్ వీడియో: ఓంకారం విన్న పాప ఏం చేసింది?

చంటిపిల్లలు ఆడుకున్నంత సేపు బాగానే అనిపిస్తుంది. కానీ వాళ్లు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారో.. ఎలా సముదాయించాలో అర్థం కాక తల పట్టుకోవాల్సి వస్తుంది.

చంటిపిల్లలు ఆడుకున్నంత సేపు బాగానే అనిపిస్తుంది. కానీ వాళ్లు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారో.. ఎలా సముదాయించాలో అర్థం కాక తల పట్టుకోవాల్సి వస్తుంది. కానీ అమెరికాలో మాత్రం ఓ తండ్రికి ఇలాంటి ఇబ్బంది ఏమీ లేదు. తన చిన్నారి కూతురు గుక్కపట్టి ఏడుస్తుంటే ఆమెను నిద్రపుచ్చడానికి ఆయన దగ్గర ఓ మంత్రం ఉంది. అదే.. ఓంకారం. ఇలా ఓంకారం జపిస్తూ తన కూతురిని నిద్రపుచ్చిన చిన్న వీడియోను ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగానే ఒక్కసారిగా ఆ వీడియో వైరల్ అయ్యింది. శాండియాగో ప్రాంతానికి చెందిన డేనియల్ ఐసెన్‌మన్ అనే ఆ తండ్రి తన కూతురు ఏడుస్తున్నప్పుడు పక్కనే పడుకుని... ఆమెకు వినపడేలా మంద్రస్వరంతో 'ఓం' అని సుదీర్ఘంగా అన్నారు. ఆయన పూర్తిగా అనడం కూడా అవ్వకముందే ఆ పాప ఎంచక్కా నవ్వుతూ నిద్రపోయింది. ఈ మొత్తం విషయం గురించిన వీడియోను ఆయన ఏప్రిల్ 22న పోస్ట్ చేయగా.. ఇప్పటికి ఏకంగా 3.5 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ ట్రిక్ చూపించడానికి ఐసెన్‌మన్ ఫేస్‌బుక్ లైవ్ వీడియోను ఉపయోగించుకున్నారు. తర్వాత ఆ వీడియోను పోస్ట్ చేశారు.

తన కూతురు డివినా ఏడుస్తుండగా తొలుత మాట్లాడుతూ, తర్వాత మాటలు ఆపేసి తన కూతురివైపు కొన్ని సెకన్లు చూసి.. 'ఓఓఓఓఓఓఓఓఓఓఓఓం' అని అంటారు. వెంటనే ఆ పాప ఏడుపు ఆపేసి అలా నిద్రలోకి జారుకుంటుంది. ఫేస్‌బుక్‌లో ఈ వీడియో చూసినవాళ్లంతా ఒక్కసారిగా దానికి ఫిదా అయిపోయారు. ఈ వీడియోకు 3.6 లక్షల షేర్లతో పాటు 2.4 లక్షల రియాక్షన్లు కూడా వచ్చాయి. ఓంకారంలో ఉన్న వైబ్రేషన్ల శక్తి వల్లే పాప అంత చక్కగా నిద్రపోయిందని చాలామంది కామెంట్ చేశారు. ఇది చూసిన తర్వాత తాము కూడా అలాగే తమ పిల్లలను పడుకోబెడుతున్నామని మరికొందరు అన్నారు. తన మనవడు నిద్రమధ్యలో లేచి ఏడుస్తుంటాడని, వాడిని వెంటనే నిద్రపుచ్చడానికి తాను ఇదే మంత్రం వాడుతున్నానని ఓ యూజర్ కామెంట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement