ట్రంప్కు లోకజ్ఞానం లేదు: గ్రేగ్ | Donald P. Gregg endorsed Democratic presidential nominee Hillary Clinton | Sakshi
Sakshi News home page

ట్రంప్కు లోకజ్ఞానం లేదు: గ్రేగ్

Sep 26 2016 11:05 AM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్కు లోకజ్ఞానం లేదు: గ్రేగ్ - Sakshi

ట్రంప్కు లోకజ్ఞానం లేదు: గ్రేగ్

డొనాల్డ్ ట్రంప్ బొత్తిగా లోకం పోకడ తెలియని మనిషి అని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు డొనాల్డ్ పీ గ్రేగ్ విమర్శించారు.

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ బొత్తిగా లోకజ్ఞానం లేని మనిషి అని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు డొనాల్డ్ పీ గ్రేగ్ విమర్శించారు. జార్జ్ బుష్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎన్ఎస్ఏగా పనిచేసిన గ్రేగ్.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ప్రమాదకరమైన వ్యక్తిగా పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ సంక్లిష్టతపై ట్రంప్కు అవగాహన లేదని.. అలాగే ఎలాంటి నైతిక విలువలను సైతం ట్రంప్ కలిగి ఉన్నట్లుగా తనకు అనిపించడంలేదని గ్రేగ్ విమర్శించారు.

అదే సమయంలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు గ్రేగ్ తన మద్దతు తెలిపాడు. తాను గతంలో సైతం హిల్లరీ పనితీరును గమనించానిని, ఆమెకున్న పరిజ్ఞానం, అనుభవంతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటుందని కితాబిచ్చారు. అమెరికా అధ్యక్షురాలిగా ఆమె బాగా పనిచేయగలుగుతుందని జోస్యం చెప్పారు. దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా పనిచేయడంతో పాటు, పలు కీలక పదవులను గ్రేగ్ గతంలో నిర్వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement