‘కామా’కు ఫుల్‌స్టాప్! | Sakshi
Sakshi News home page

‘కామా’కు ఫుల్‌స్టాప్!

Published Mon, Feb 10 2014 2:51 AM

comma is replaced by full stop

 లండన్: ఆంగ్ల భాష వాక్య నిర్మాణంలో విరివిగా ఉపయోగించే విరామ చిహ్నమైన ‘కామా’ వాడకానికి ‘ఫుల్‌స్టాప్’ పెట్టొచ్చని ఓ అమెరికా విద్యావేత్త సూచించారు. ఆధునిక అమెరికా వాచకాల నుంచి ఈ చిహ్నాన్ని తొలగించినా వాక్యాల స్పష్టత విషయంలో ఎటువంటి నష్టం జరగదని కొలంబియా యూనివర్సిటీకి చెందిన తులనాత్మక సాహిత్య, ఆంగ్ల అసోసియేట్ ప్రొఫెసర్ జాన్ మెక్‌వోర్టర్ అభిప్రాయపడ్డారు. నెటిజన్లతోపాటు ఆధునిక రచయితలు వారికి తోచినట్లుగా లిపిని వాడుతున్నారని, ‘కామా’ను వాడటానికి ఇష్టపడటంలేదని చెప్పారు. ఇటువంటి వాటి వాడకం కేవలం సంప్రదాయమేనని... కాలానుగుణంగా అవి మారుతుంటాయన్నారు.
 
 

Advertisement
Advertisement