
తల తెగిపోయినా నడుస్తున్న కోడి
రాట్చ్‌బురి, థాయ్‌లాండ్ : తల తెగిపడినా ఓ కోడి పెట్ట ఇంకా బతికేవుండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వారం రోజులుగా ఇలా ప్రాణాల కోసం పోరాడుతున్న ఆ కోడిని వెటర్నరీ సర్జన్ దత్తత తీసుకున్నారు. మెడ ద్వారా డ్రాప్స్ రూపంలో కోడికి ఆహారం అందిస్తున్నారు.
అంతేకాకుండా మరే ఇతర వ్యాధులకు గురికాకుండా ఉండేందుకు యాంటీ బయాటిక్స్‌ను ఎక్కిస్తున్నారు. తన అందిస్తున్న చికిత్సకు కోడి బాగా స్పందిస్తున్నట్లు సర్జన్ తెలిపారు. బతకాలనే సంకల్పం కోడిలో ఉందని, అందుకే తల తెగిపడినా అది మనగలుగుతోందని అన్నారు.
జంతువు దాడిలో కోడి మెడను కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, తల తెగిన కోడి ఫొటోలను నెట్టింట్లో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి.