బురుండీ అధ్యక్షుడి హఠాన్మరణం | Burundi President Nkurunziza Dies of Heart attack | Sakshi
Sakshi News home page

బురుండీ అధ్యక్షుడి హఠాన్మరణం

Jun 10 2020 10:44 AM | Updated on Jun 10 2020 10:48 AM

Burundi President Nkurunziza Dies of Heart attack - Sakshi

గిటేగా : బురుండీ అధ్యక్షుడు ఎన్‌కురుంజిజా(55) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో దేశ అధ్యక్షుడు మృతిచెందారని బురుండీ ప్రభుత్వం వెల్లడించింది. ఆరోగ్యం సరిగాలేకపోవడంతో శనివారం ఎన్‌కురుంజిజా ఆసుపత్రిలో చేరారు. తర్వాత కోలుకున్నా సోమవారం ఒక్కసారిగా గుండెపోటురావడంతో, ఆయన్ను రక్షించడానికి డాక్టర్లు తీవ్రంగా కృషి చేసినా ఫలితంలేకుండా పోయిందని అధికారులు తెలిపారు. 

ఇటీవలే ఎన్‌కురుంజిజా సతీమణి డెనిస్‌ ఎన్‌కురుంజిజాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె  కెన్యాలో అగాఖాన్‌ యూనివర్సిటీ ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు.  దీంతో అధ్యక్షుడు ఎన్‌కురుంజిజా కూడా కరోనా కారణంగానే మృతిచెంది ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement