టర్కీలో వరుస హిమపాతాలు.. | Avalanches kill at least 38 in eastern Turkey | Sakshi
Sakshi News home page

టర్కీలో వరుస హిమపాతాలు..

Feb 6 2020 4:34 AM | Updated on Feb 6 2020 4:34 AM

Avalanches kill at least 38 in eastern Turkey - Sakshi

.హిమపాతం కారణంగా మంచులో కూరుకుపోయిన వారి జాడ కోసం శ్రమిస్తున్న సిబ్బంది

అంకారా: టర్కీలోని వాన్‌ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న రెండు వరుస హిమపాతాల కారణంగా 38 మంది  మంచులో సజీవసమాధి అయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన మొదటి హిమపాతంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వీరిని వెలికితీసేందుకు దాదాపు 300 మంది అత్యవసర విభాగం ఘటనా స్థలికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం మరో హిమపాతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో 8 మంది మిలిటరీ ఆఫీసర్లు, 9 మంది వాలంటీర్లు, మరో ముగ్గురు ప్రభుత్వం నియమించిన గార్డులు ఉన్నట్లు చెప్పారు. గల్లంతైన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement