ఊబకాయానికి..సూక్ష్మజీవులకు లింకు! | Aerobe link to obesity | Sakshi
Sakshi News home page

ఊబకాయానికి..సూక్ష్మజీవులకు లింకు!

Jul 27 2016 3:36 AM | Updated on Sep 4 2017 6:24 AM

ఊబకాయానికి..సూక్ష్మజీవులకు లింకు!

ఊబకాయానికి..సూక్ష్మజీవులకు లింకు!

ఎంత మితంగా తిన్నా లావెక్కుతున్నారా.. ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా.. అయితే దానికి కారణం మీ పేగుల్లోని సూక్ష్మజీవులే!

ఎంత మితంగా తిన్నా లావెక్కుతున్నారా.. ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా.. అయితే దానికి కారణం మీ పేగుల్లోని సూక్ష్మజీవులే! తినే ఆహారంలోని పోషకాలు ఒంట పట్టేందుకు పేగుల్లోని సూక్ష్మజీవులు (మైక్రో బయోమ్) దోహదపడుతాయనే విషయం తెలిసిందే. అయితే ఈ మైక్రో బయోమ్‌లో తేడా వస్తే అనేక సమస్యలు వస్తాయని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తేలింది.

కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే జంతువుల్లో ఎసిటేట్ అనే రసాయనాన్ని అధిక మొత్తంలో కనుగొన్నారు. అలాగే ఎసిటేట్‌ను శరీరంలోకి ఎక్కించినపుడు క్లోమంలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయని గుర్తించారు. అయితే దీనికి కారణాలు తెలియరాలేదు.ఎసిటేట్‌ను నేరుగా మెదడులోకి ఎక్కిస్తే పర సహనుభూత నాడీ వ్యవస్థ ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతోందని పరిశోధకులు వివరించారు. అతిగా తినడాన్ని ప్రేరేపించే గ్యాస్ట్రిన్, గ్రెలిన్ అనే హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement