కువైట్ లో ఎగరనున్న భారత జెండా.. | 70th Independence Day Celebrations by Indian Embassy - Kuwait | Sakshi
Sakshi News home page

కువైట్ లో ఎగరనున్న భారత జెండా..

Aug 13 2016 10:24 AM | Updated on Oct 2 2018 7:21 PM

కువైట్ లో ఎగరనున్న భారత జెండా.. - Sakshi

కువైట్ లో ఎగరనున్న భారత జెండా..

కువైట్ లో ఆగస్టు 15న భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది.

కువైట్ః భారత స్వాతంత్ర దినోత్సవానికి కువైట్ ఆహ్వానం పలికింది. ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో జరిగే వేడుకలకు ప్రజలంతా హాజరు కావాలని ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2016 ఆగస్టు 15న జెండా వందనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది.

కువైట్ లో ఆగస్టు 15న భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది. 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో జెండా వందనం కార్యక్రమం నిర్వహించనుంది. ఈ వేడుకలకు కువైట్ లోని భారతీయులంతా హాజరు కావాలని ఎంబసీ.. పత్రికా ప్రకటనద్వారా ఆహ్వానం పలికింది. జెండా వందనం అనంతరం భారత కువైట్ రాయబారి భారత రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపిస్తారని,  వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, దేశభక్తి గీతాలాపన ఉంటుందని తెలిపింది. జెండావందనానికి హాజరైన అతిథులకు, ప్రజలకు అల్పాహార విందును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనలో వివరించింది. కువైట్ లోని భారతీయులందరూ ఈ వేడుకలకు హాజరు కావాలని ఎంబసీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. ఉదయం 7.30 కల్లా  రమ్మంటూ ఆహ్వాన పత్రంలో ప్రత్యేక సూచన కూడా ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement