ఆఫ్ఘానిస్థాన్లో శనివారం భద్రత బలగాలు కనీసం 30 మంది తాలిబన్ ఉగ్రవాదులను హతమార్చాయి.
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్లో ఆదివారం భద్రత బలగాలు కనీసం 30 మంది తాలిబన్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఆఫ్ఘాన్ జాతీయ భద్రత బలగాలు (ఏఎన్ఎస్ఫ్) నంగర్హర్, బగ్లాన్, ఫరా, హెమండ్ ప్రావిన్సులలో ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు వారి నుంచి పెద్ద ఎత్తున వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు వైపు పాతిపెట్టిన ఏడు మందుపాతరలను భద్రత సిబ్బంది నిర్వీర్యం చేశారు.