కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి | 18 killed in Indonesia landslides | Sakshi
Sakshi News home page

కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి

Dec 13 2014 6:26 PM | Updated on Sep 2 2017 6:07 PM

కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి

కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి

ఇండోనేషియాలోని జావా రాష్ట్రంలో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి చెందారు.

జకార్తా: ఇండోనేషియాలోని జావా రాష్ట్రంలో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి చెందారు. 90 మంది గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 105 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అనేక మంది ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వందలాది మంది పోలీసులు, సైనికులు సహాయక చర్యలు చేపట్టారు.

శిథిలాల కింద పడి మరణించినవారి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 420 మందిని ఇళ్లు ఖాళీ చేయించి సహాయక శిబిరాలకు తరలించారు. భారీ వర్షానికి మట్టిపెళ్లలు విరిగి రోడ్లపై పడటంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. శిథిలాలను తొలగించేందుకు భారీవాహనాలు వెళ్లడం కూడా కష్టమవుతోంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement