బామ్మలకే బామ్మ! | 127 th birthday of Leandro Becker lumber Ross | Sakshi
Sakshi News home page

బామ్మలకే బామ్మ!

Sep 1 2014 3:14 AM | Updated on Sep 2 2017 12:41 PM

బామ్మలకే బామ్మ!

బామ్మలకే బామ్మ!

మెక్సికోలోని జాపోపన్ పట్టణానికి చెందిన ‘లియాండ్రా బెకెర్రా లుంబ్రెరాస్’ అనే ఈ బామ్మ ఆదివారం 127వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొంది.

మెక్సికోలోని జాపోపన్ పట్టణానికి చెందిన ‘లియాండ్రా బెకెర్రా లుంబ్రెరాస్’ అనే ఈ బామ్మ ఆదివారం 127వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొంది. 1887, ఆగస్టు 31న పుట్టిన ఈ అవ్వ రెండు ప్రపంచయుద్ధాలతో సహా ఎన్నో చారిత్రక ఘట్టాలను చూసింది. 1910-1917 మధ్య మెక్సికన్ విప్లవంలో భర్తలతో కలిసి కదనరంగంలోకి దూకిన ‘అడెలిటాస్’ మహిళా బృందానికి స్వయంగా నాయకత్వం కూడా వహించిందట. ఐదుగురు పిల్లలు, 20 మంది మనవలు, మనవరాళ్లు ఈ అవ్వ కళ్లముందే మట్టిలో కలిసిపోయారు.
 
 ఇప్పుడు 73 మంది మనవలు, మనవరాళ్లు, 55 మంది మునిమనవలు, మనవరాళ్లు ఉన్నారట. ప్రస్తుతం కొంచెం చెవుడు, కళ్లలో శుక్లాల సమస్యతో బాధపడుతున్నా ఉత్సాహంగానే ఉందట. చిన్నచిన్న పనులు కూడా సొంతంగానే చేసుకుంటోందట. ఇంతకూ ఈ అవ్వ ఆరోగ్య రహస్యం ఏంటని అడిగితే.. చాక్లెట్లు తినడం, బాగా నిద్రపోవడమేనంటున్నారు ఈమె మనవరాళ్లు. ఇప్పటికి ఉన్న రికార్డులను బట్టి చూస్తే.. మనుషుల అందరి కన్నా అత్యధిక కాలం జీవించిన మనిషి ఈమేనని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement