
వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి, తెలుగు రాష్ట్రాల వారికి 2016 చిరస్మరణీయం కావాలని ఆయన అన్నారు. కొత్త ఏడాది ఇంటింటా ఆనందాలు నిండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్ఆర్ సీపీ ఓ ప్రకటన విడుదల చేసింది.