యువతి కోసం స్నేహితుడిపై కత్తులతో దాడి | yoth jailed for attack on friend in kalapattar | Sakshi
Sakshi News home page

యువతి కోసం స్నేహితుడిపై కత్తులతో దాడి

May 3 2014 8:19 AM | Updated on Aug 20 2018 4:27 PM

యువతి కోసం స్నేహితుడిపైనే ఓ యువకుడు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.

హైదరాబాద్ : యువతి కోసం స్నేహితుడిపైనే ఓ యువకుడు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కాలపత్తర్ పోలీస్ స్టేషన్  పరిధిలో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. ఇనస్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ మాజీద్ తెలిపిన వివరాల ప్రకారం... కాలాపత్తర్ బిర్యానీ షా టేకుడి ప్రాంతానికి చెందిన హుస్సేన్ బిన్ కాలేద్ (25) కాలాపత్తర్ ఇంద్రానగర్కు చెందిన అసద్ (25) స్నేహితులు.

హుస్సేన్ ఇంటి ఎదురుగా ఉన్న ఓ యువతి విషయంలో హుస్సేన్ ఇంటికి వెళ్లి అతనిపై స్నేహితులతో కలిసి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కాలేద్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి సోదరుడు జాబెద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement