నోట్లు లేకుంటే పాట్లు.. | Without Currency there will be Cyber terrorism | Sakshi
Sakshi News home page

నోట్లు లేకుంటే పాట్లు..

Dec 3 2016 3:03 AM | Updated on Sep 4 2017 9:44 PM

నోట్లు లేకుంటే పాట్లు..

నోట్లు లేకుంటే పాట్లు..

నగదు రహిత వ్యవస్థ.. నల్లధనంతోపాటు అనేక రకాలైన అవినీతికి ఇదే విరుగుడు అని కేంద్రం చెబుతోంది.

- కార్డులతో లావాదేవీలు గ్రామీణులకు ఇబ్బందే
- నిరంతర అప్రమత్తత లేకుంటే ఖాతా ఖాళీ..
 
 నగదు రహిత వ్యవస్థ.. నల్లధనంతోపాటు అనేక రకాలైన అవినీతికి ఇదే విరుగుడు అని కేంద్రం చెబుతోంది. అన్ని లావాదేవీలు కార్డుల ద్వారానే జరగాలని స్పష్టంచేస్తోంది. అరుుతే ఇందులోనూ అనేక లోటుపాట్లున్నాయి. వినియోగదారుడు నిరంతరం అప్రమత్తంగా లేకుంటే ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. అవేంటో ఓసారి చూద్దాం..  
 - సాక్షి నాలెడ్జ్ సెంటర్
 
సైబర్ నేరాలతో నిరంతర ప్రమాదం
 డిజిటల్ ఆర్థిక లావాదేవీలకు హ్యాకింగ్ ప్రమాదం నిరంతరం పొంచే ఉంటుంది. ఎంతటి కట్టుదిట్టమైన సైబర్ భద్రతా ఏర్పాట్లు చేసినా.. హ్యాకర్లు, ఆన్‌లైన్ మోసగాళ్లు కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ దాడులు చేస్తూనే ఉంటారు. పైగా.. మన దేశంలో 90 శాతం మందికి పైగా డిజిటల్ ఆర్థిక లావాదేవీలు పూర్తిగా కొత్త. దీంతో.. హ్యాకింగ్, ఫిషింగ్ వంటి డిజిటల్ మోసాలకు ఎక్కువ మంది బలయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవలే దేశంలో 32 లక్షల డెబిట్ కార్డుల సమాచారం తస్కరణకు గురవడం ఈ ముప్పును చాటి చెప్తోంది.
 
నిరక్షరాస్యులకు మోసాల ముప్పు
 దేశంలో ఎంతో మందికి మాతృభాషలోనే చదవడం రాయడం రాదు. వారు డిజిటల్ లావాదేవీల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో వారి వివరాలు తస్కరించి, వారి ఖాతాల్లోని నగదు చోరీకి గురవడం, వారి ఖాతాలను ఉపయోగించి కొనుగోళ్లు చేయడం వంటి మోసాలకు వారు అధికంగా గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది విధ్యాధికులు సైతం డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను ఈ విధంగా కోల్పోరుు మోసపోరుున ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నారుు.
 
నియంత్రణలేని డిజిటల్ ఖర్చు
 నగదు భౌతికంగా చేతిలో ఉన్నపుడు జనం కాస్త జాగ్రత్తగా ఖర్చు పెడతారు. కానీ.. అదే డబ్బు కార్డు రూపంలోనో డిజిటల్ రూపంలోనో ఉంటే అంత జాగ్రత్త ఉండదు. క్రెడిట్ కార్డులు చేతిలో ఉన్నపుడు ప్రజలు నియంత్రణ లేకుండా ఖర్చు పెట్టడం చూశాం. ప్లాస్టిక్, డిజిటల్ మనీ వల్ల జనం తాము అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చుపెడతారు. దానివల్ల అత్యవసర పరిస్థితులు, భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకోవడం తగ్గుతుంది. ఫలితంగా అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది.
 
 ప్రతి కొనుగోలుకూ చార్జీలు
 కరెన్సీ నోట్లతో లావాదేవీలకు దాదాపుగా ఎటువంటి అదనపు ఖర్చూ ఉండదు. కానీ.. డెబిట్ కార్డులు, ఆన్‌లైన్ లావాదేవీలకు ప్రాసెసింగ్ ఫీజులు ఉంటారుు. ప్రతి కొనుగోలుకూ ఈ చార్జీలు అవి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వినియోగదారులే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిం చడానికి ఈ ఫీజుల్లో కొంత తగ్గించినా.. భవిష్యత్తులో ఈ ఫీజులతో పాటు అదనంగా కొత్త ఫీజులు కూడా విధించే అవకాశముంది. ఎక్కువ ఖర్చు చేసే వారికి ఎక్కువ రివార్డు పారుుంట్లు అనే ఆఫర్లు పెట్టే డిజిటల్ మనీ సంస్థలు.. ఆ రివార్డులు చెల్లించడానికి ఇలా ఫీజులు వడ్డిస్తుంటారుు.
 
 వ్యక్తిగత గోప్యతకు చెల్లుచీటీ
 ప్లాస్టిక్, డిజిటల్ రూపంలో చేసే చెల్లింపులన్నీ రికార్డుల్లో శాశ్వతంగా నమోదైపోతారుు. ఎప్పుడెప్పుడు దేనికోసం ఎంతెంత ఖర్చుపెట్టారన్న వివరాల జాబితా ఒక్క బటన్ నొక్కితే తెలిసిపోతారుు. చట్టపరంగా తప్పుకాకపోరుునా సామాజిక వ్యతిరేకత ఉన్న మద్యపానం, నీలిచిత్రాల వీక్షణం వంటి వాటికోసం చెల్లించే చెల్లింపులు ఎంతోమంది గోప్యంగా చేస్తుంటారు. ఇక ఈ గోప్య త లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య కూడా కలహాలకు దారితీస్తుంది. అంతేకాదు.. ప్రభుత్వాలు, నిఘా సంస్థలు ప్రతి ఒక్కరి కార్యకలాపాలనూ తెలుసుకోగలుగుతారుు.
 
 నేర కార్యకలాపాల నిరూపణ కష్టం
 ఎవరైనా ఒక వ్యక్తి డిజిటల్ వివరాలను మరొకరు తస్కరించి.. ఆ వివరాలతో ఏదైనా నేరానికి పాల్పడినపుడు.. ఆ వివరాలకు సంబంధించిన వ్యక్తి నేరారోపణను ఎదుర్కోవాల్సి వస్తుంది. సదరు వ్యక్తి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం కష్టమవడమే కాదు.. అసలు నేరానికి పాల్పడిన దోషి జాడ తెలుసుకోవడం కూడా కష్టమే అవుతుంది. డిజిటల్ వ్యవస్థ పెరిగేకొద్దీ ఈ తరహా నేరాల విసృ్తతి పెరుగుతుంది.
 
 ప్రభుత్వ అప్పులకూ కరెన్సీ ఉండదు
 నగదు రహిత వ్యవస్థ వల్ల ప్రజలకే కాదు.. ప్రభుత్వానికీ ఇబ్బందులు ఉంటా రుు. ప్రభుత్వం నగదును ముద్రించి అప్పులు తిరిగి చెల్లించడానికి ఉండే ఒక ముఖ్యమైన అవకాశాన్ని కోల్పోతుంది. బాండ్లు, బిల్లుల రూపంలో అప్పులకు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అలా వాటిపై వడ్డీలు పెరిగిపోరుు అప్పుల భారమూ పెరుగుతుంటుంది.
 
 బ్యాంకులు మునిగితే జనం మునుగుతారు

 కరెన్సీ నోట్లను దాచుకోవడానికి పెద్దగా ఖర్చు కాదు. మన డబ్బును డిజిటల్ రూపంలో బ్యాంకుల్లో డిపాజి ట్లుగా దాచుకోవడానికి ముందుముందు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సదరు బ్యాంకు దివాలా తీస్తే.. అందులో డబ్బు దాచుకున్న జనం కూడా నష్టపోవాల్సి వస్తుంది.
 
 సైబర్ ఉగ్రవాదం ముప్పు
 ఆర్థిక లావాదేవీలు ప్రధానంగా డిజిటల్ రూపంలో ఉన్నట్లరుుతే.. ఉగ్రవాదులు హ్యాకింగ్ వంటి సైబర్ దాడులతో దేశ ఆర్థిక వ్యవస్థకు భారీనష్టం చేకూర్చే ప్రమాదమూ పొంచివుంటుంది. ఏ ఒక్క ప్రధాన బ్యాంకు ఇలాంటి హ్యాకింగ్‌కు గురైనా కూడా వాటిల్లే నష్టం తీవ్రంగానే ఉంటుంది.
 
 మాంద్యంలో  అవకాశం లేదు
 దేశ ఆర్థిక వ్యవస్థ మాం ద్యంలో ఉన్నపుడు, లేదా ఆర్థిక సంక్షోభం తలెత్తినపుడు ప్రజ లు ముందు జాగ్రత్త చర్యగా నగదును విత్‌డ్రా చేసుకుని భవిష్యత్ ఖర్చుల కోసం ఇంట్లో దాచుకుంటుంటారు. కానీ.. నగదు రహిత వ్యవస్థలో డబ్బు డిజిటల్ రూపం లోనే ఉంటుంది కాబట్టి.. అలా విపత్కర సమయాల్లో నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండదు.
 
 పరిష్కారంలో జాప్యం
 నగదు రహిత వ్యవ స్థలో అందులో లక్షల సంఖ్యలో సమస్యలు తలెత్తుతుంటారుు. రోజూ లక్షలాదిగా వచ్చి పడే ఫిర్యాదులను, సమస్యలను పరిష్కరించడానికి బ్యాంకులు, డిజిటల్ మనీ సంస్థల్లో సుశిక్షితులైన సిబ్బంది నియామకానికి చాలా సమయం పడుతుంది.
 
 బ్యాంకు ఎదుట మహిళల ధర్నా
 ధర్మారం: డబ్బులు విత్‌డ్రా చేసుకునేం దుకు రోజుల తరబడి తిప్పుకుంటు న్నారంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఎస్‌బీహెచ్ బ్యాంకు ఎదుట శుక్రవారం మహిళలు రాస్తారోకో చేశారు. డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు క్యూకటా ్టరు. బ్యాంకు అధికారులు ఖాతాదారులకు డబ్బులు ఇవ్వటానికి ప్రయత్నించగా.. సాంకేతిక సమస్య ఏర్పడిందని వేచి ఉండాలని బ్యాంకు సిబ్బంది ఖాతాదారులకు చెప్పారు. మధ్యాహ్నం వరకు ఎదురుచూసిన ఖాతాదారులు బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించగా.. సరైన సమాధానం రాలేదు. దీంతో ఆగ్రహించిన మహిళలు బ్యాంకు ఎదుట గల రోడ్డుపై బైఠారుుంచి రాస్తారోకో చేశారు. ఎస్సై హరిబాబు జోక్యంతో రాస్తారోకో విరమించిన మహిళలు తిరిగి డబ్బుల కోసం లైన్ కట్టారు.
 
 బిడ్డ లగ్గం ఉందన్నా డబ్బులిస్తలేరు..
 సాక్షి, కామారెడ్డి: ‘‘మాది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఫరీదుపేట. నా పేరు ఎర్రోళ్ల నారాగౌడ్. ఈ నెల 19న నా బిడ్డ పెళ్లి ఉంది. మాచారెడ్డి మండలం పాల్వంచలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. అందులో రూ. 50 వేలు ఉన్నారుు. డబ్బుల కోసం మేనేజర్‌ను అడిగితే పట్టించు కుంటలేరు. రోజుకు రూ. 2 వేలు తీసు కెళ్లమంటున్నరు. రోజూ బ్యాంకు చుట్టే తిరిగితే పెళ్లి పనులెట్ల సాగుత రుు ’’అని నారాగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.  
 
 ఆస్పత్రి నుంచి.. బ్యాంకుకే..

 ఈమె కలవేన భూదమ్మ. పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేట. 5 రోజుల క్రితం అనారోగ్యంతో పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. చేతిలో ఉన్న నగదు ఖర్చు కావడంతో బ్యాంకు ఖాతాలో ఉన్న పైసలు తీసుకునేందుకు వచ్చింది. నేరుగా ఆస్పత్రి నుంచే సెలైన్ ఎక్కించిన ఐవీ క్యాన్వల్‌తోనే కొడుకు, కోడలి సాయం తో బ్యాంకుకు చేరుకుంది. బ్యాంకు నిండా జనం ఉన్నా ఎలాగోలా కౌంటర్ వద్దకు చేరుకుంటే బ్యాంకు అధికారులు కరెన్సీ లేదని వెళ్లిపొమ్మన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక, బ్యాంకులో డబ్బులు రాకపోతే తన పరిస్థితి ఏమిటంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
 
 వైద్యం కోసం రూ. 2 వేలైనా ఇవ్వండి
 బ్యాంక్ మేనేజర్ ఎదుట కన్నీటి పర్యంతమైన మహిళ
 చిన్నశంకరంపేట: మెదక్ జిల్లాలో చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన అవుసుల నాగమణి  వైద్య అవసరాల కోసం డబ్బు అవసరమై శుక్రవారం బ్యాంకుకు వెళ్లింది. తన తలకు గాయమైందని వైద్యం కోసం రూ. 2 వేలైనా ఇవ్వమని ఎస్‌బీఐ మేనే జర్ అన్నపూర్ణ ఎదుట కన్నీటి పర్యంతమైంది. అరుునప్పటికీ తమ దగ్గర డబ్బులు లేవని మేనేజర్ తెలపడంతో ఆ మహిళ ఉసూరుమం టూ వెనుదిరిగారు.  
 
 డబ్బుల్లేక, వైద్యం అందక కార్మికుడు మృతి
 కమలాపూర్: చేతిలో డబ్బుల్లేక, సరైన సమయంలో వైద్యం అందక తాపీ కార్మికుడు మృతి చెందాడు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లికి చెందిన రావుల భిక్షపతి (35) తాపీ కార్మికునిగా పనిచేసుకుంటున్నాడు. గత నెల 30న రాత్రి భిక్షపతికి గుండెపోటు వచ్చింది. స్థానికంగా వైదం అందిచాక, మెరుగైన వైద్యం కోసం ఈ నెల 1న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ముందుగా రూ.20 వేలు డిపాజిట్ చేయాలని ఆస్పత్రి సిబ్బంది సూచించారు. ప్రస్తుతం తమ వద్ద అంతడబ్బు లేదని, మరునాడు డబ్బులు చెల్లిస్తామని చెప్పినా ఆస్పత్రి సిబ్బంది వినకపోవడంతో అక్కడే ఓ బంగారు నగల వ్యాపారి వద్దకు వెళ్లి తమ వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టుకోమనగా వ్యాపారి అందుకు నిరాకరించాడు. డబ్బులు డిపాజిట్ చేయకపోవడంతో రాత్రంతా వైద్యం అందలేదు. శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి భిక్షపతి మృతిచెందా డు. మృతునికి భార్య సుమలత, కూతురు గౌతమి ఉన్నారు.  
 
 డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతులు, మహిళలు
 భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో శుక్రవారం డబ్బుల కోసం వచ్చిన మహిళలు, రైతులు రోడ్డెక్కారు. డబ్బుల కోసం వివిధ గ్రామాల నుంచి పెద్దఎత్తున రైతులు, మహిళలు భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని ఎస్‌బీహెచ్‌కు వచ్చారు. 150 మందికే బ్యాంకు సిబ్బంది టోకెన్లు ఇచ్చి మిగతా వారు రేపు రావాలని చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.  పనులు వదులుకుని ఎన్ని రోజులని బ్యాంకుల చుట్టూ తిరగాలంటూ రోడ్డుపై బైఠారుుంచి ధర్నా చేశారు.
 
 క్యాష్‌లెస్ చెల్లింపుల ప్రక్రియకు శ్రీకారం  
 మెదక్ రూరల్: మెదక్ జిల్లాలోని మాచవరం పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట నగదు రహిత చెల్లింపుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ఈ పంచాయతీలో మొబైల్ పారుుంట్ ఆఫ్ సేల్ ద్వారా ఆస్తి, అమ్మకం పన్నులను స్వీకరించనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొబైల్ పారుుంట్ ఆఫ్‌సేల్ యంత్రాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ భారతి హోళికేరి మాచవరం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ సీతారామయ్య కార్డు ద్వారా ఇంటి పన్ను చెల్లించి నగదు రహిత చెల్లింపుల సేవలను ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement