పార్టీలకు సంకటం! | with in a week elections schedule will ready | Sakshi
Sakshi News home page

పార్టీలకు సంకటం!

Mar 2 2014 2:21 AM | Updated on Oct 16 2018 6:33 PM

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండటంతో రాజకీయ పార్టీలు సంకటస్థితిలో పడ్డాయి. ఎన్నికలు నిర్వహించకపోతే రాజ్యాంగ ధిక్కారమవుతుందంటూ సుప్రీంకోర్టు, హైకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం శనివారం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.

 ఇప్పటికే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచనల్లో నేతలు
 స్థానిక రాజకీయూలపై దృష్టిపెడితే విలువైన
 సమయం వృథా అవుతుందనే ఆందోళన
 ఎన్నికల సంఘ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
 ముంచుకొస్తున్న మున్సిపల్ ఎన్నికలతో గందరగోళం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండటంతో రాజకీయ పార్టీలు సంకటస్థితిలో పడ్డాయి. ఎన్నికలు నిర్వహించకపోతే రాజ్యాంగ ధిక్కారమవుతుందంటూ సుప్రీంకోర్టు, హైకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం శనివారం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన అధికారికంగా అమల్లోకి వచ్చిన వెంటనే గవర్నర్ ఈ ఫైల్‌పై సంతకం చేశారు. ఎన్నికల సంఘం సోమ, మంగళవారాల్లో గనుక నోటిఫికేషన్ జారీ చేస్తే ఇక అధికార యంత్రాంగం, పార్టీలు అనివార్యంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సిద్ధపడాల్సిన అనివార్యత ఏర్పడనుంది. మరోవైపు ఎన్నికల నిర్వహణ దిశలో తాను తీసుకున్న చర్యలను ప్రభుత్వం హైకోర్టుకు సోవువారం నివేదించే వీలుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల రంగ ంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడితే కొన్ని చికాకులను ఎదుర్కొనక తప్పదని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

     రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా లేవు. ఇవి చాలాకాలంగా వాయిదా పడుతున్నందున ఇప్పట్లో వీటి నిర్వహణ ఉండదనే అభిప్రాయంలోనే ఉన్నాయి.
 
     లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ వ్యూహరచనల్లో పార్టీలు నిమగ్నమై ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఎన్నికల ప్రచారాన్నీ ప్రారంభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలంటే దృష్టిని మరల్చి పూర్తిగా స్థానిక రాజకీయూలపై కేంద్రీకరించాల్సి ఉంటుందని, ఇది మరోవైపు నుంచి తరుముకొస్తున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వ్యూహాల అవులుకు ప్రతిబంధకంగా మారుతుందనీ పలు రాజకీయ పక్షాలు చెబుతున్నాయి.
 
     సాధారణ ఎన్నికలపై కేంద్రీకరించాల్సిన విలువైన సమయం మున్సిపల్ ఎన్నికల కారణంగా వృథా అవుతుందనేది ఆయూ పార్టీల ఆందోళనగా ఉంది.  న్యాయస్థానాల జోక్యం కారణంగా ఇప్పుడవి వాయిదా పడే సూచనలూ కన్పించకపోవడంతో నేతలు మరింత సందిగ్ధ పరిస్థితికి గురవుతున్నారు.
 
     అధికార యుంత్రాంగం ఒకేసారి మున్సిపల్, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పనిని సంభాళించుకోగలదా అనే ప్రశ్నకు.. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు ఏమీ ఇబ్బంది ఉండదనే సమాధానాన్నే ఇస్తున్నారు. ఎన్నికలు వాయిదా వేస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందనేది వారి భయుం.
 
     3 లేదా 4 తేదీల్లో సాధారణ ఎన్నికల షెడ్యూల్ వెలువడితే... మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ విషయుంలో ఎన్నికల సంఘం ఆలోచనలో పడే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కానీ వురో రెండు మూడు రోజులపాటు ఆలస్యవుయ్యే అవకాశముందని అధికారగణానికి ఢిల్లీ నుంచి సంకేతాలు అందుతున్నాయి. దీంతో 3 నుంచి 6 తేదీల మధ్య రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement