ఆర్టీసీ ఎన్నికల్లో టీఎంయూ ముందంజ | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎన్నికల్లో టీఎంయూ ముందంజ

Published Tue, Jul 19 2016 8:21 PM

TMU hawa in RTC union poll

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘాల ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ హవా కొనసాగుతోంది.తెలంగాణలో మంగళవారం జరిగిన ఆర్టీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం టీఎంయూ దూసుకుపోతోంది. చాలాచోట్ల టీఎంయూ విజయం సాధించింది. నల్గొండ జిల్లా కోదాడ, సూర్యాపేట, దేవరకొం,యాదగిరిగుట్టలో టీఎ౦యూ విజయం సాధించింది. దీంతో టీఎంయూ కార్మిక సంఘాలు సంబరాలు చేసుకుంటున్నారు. 

కాగా తెలంగాణ వచ్చాక ఆర్టీసీ తొలి కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని బస్ డిపోలు, ఆర్టీసీ కార్యాలయాలు, ఆర్టీసీ వర్క్‌షాపులలో పోలింగ్ కొనసాగింది. సాయంత్రం ఆరున్నరకు కౌంటింగ్ మొదలైంది. ఫలితాలను మాత్రం ఈనెల 25, 26 తేదీల్లో జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా కలిపి వచ్చేనెల 8న అధికారికంగా విడుదల చేస్తారు.

అయితే అనధికారికంగా మంగళవారం రాత్రికే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈసారి పది సంఘాలు బరిలో ఉండగా తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం 49,600 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

*వికారాబాద్, దుబ్బాకలో టీఎంయూ విజయం.
* బస్ భవన్ టీఎంయూ విజయం
* కరీంనగర్ నాన్ ఆపరేషన్ జోన్  ...టీఎంయూ విజయం
*నాన్ ఆపరేషన్ హెడ్ ఆఫీస్ జోన్ టీఎంయూ గెలుపు
*మంథని,మెదక్, సంగారెడ్డి, నారాయణఖేడ్, గజ్వేల్, దుబ్బాకలో టీఎంయూ విజయం సాధించింది.

Advertisement
Advertisement