
డబుల్ బెడ్రూం ఇళ్లపై జీఎస్టీ భారం ఉండదు
డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంపై జీఎస్టీ ప్రభావం అంతగా ఉండదని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు.
ఇది జీఎస్టీ రూపంలో భారం కాబోదని వివరించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ సిస్టమ్ (పీయంఎస్)ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పనులు సాఫీగా సాగేందుకు జిల్లా నోడల్ అధికారి జీఎస్టీ నిబంధనల ప్రకారం జీఎస్టీ చెల్లింపుదారు, జీఎస్టీ మినహాయింపుదారునిగా రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుందని వాణిజ్య, పన్నుల శాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వాణిజ్యపన్నుల కమిషనర్ అనిల్‌కుమార్, జాయింట్ కమిషనర్ సాయికిషోర్, హౌజింగ్ కార్పొరేషన్ సీఈ సత్యమూర్తి పాల్గొన్నారు.