భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వేదిక అవుతోంది.
నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు
Jan 6 2017 10:57 AM | Updated on Mar 28 2018 11:26 AM
రంగారెడ్డి: భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వేదిక అవుతోంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు ఈ మహాసభలు జరుగుతాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి ఎంపికైన 600 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరు కానున్నారు. మతోన్మాద శక్తుల వివక్షతో ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల పేరును వేదికకు నామకరణం చేశారు. ప్రపంచ కమ్యూనిస్టు నేత ఫిడెల్ కాస్ట్రో పేరుతో మహాసభల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని పలు కూడళ్లు, మహాసభల ప్రాంగణాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తోరణాలు, జెండాలతో అలంకరించారు.
Advertisement
Advertisement