ఏసీబీ కోర్టుకు రేవంత్‌రెడ్డి | Revanth Reddy attends ACB court in cash for votes scam | Sakshi
Sakshi News home page

ఏసీబీ కోర్టుకు రేవంత్‌రెడ్డి

Sep 29 2016 10:50 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ కోర్టుకు రేవంత్‌రెడ్డి - Sakshi

ఏసీబీ కోర్టుకు రేవంత్‌రెడ్డి

ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు.

ఓటుకు నోటు కేసులో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహాలు ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. నగరంలోని పాతబస్తీ ఏసీబీ కోర్టులో వీరిద్దరు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణ నిమిత్తం కోర్టులో హాజరు కావాల్సిందిగా రేవంత్, ఉదయ్ సింహాలకు గత నెలలో ఏసీబీ సమన్లు జారీచేసింది. కాగా, ఈ కేసులో విచారణ అక్టోబర్ 24కు వాయిదా పడింది. ఎ1 రేవంత్, ఎ3 ఉదయసింహ విచారణకు హాజరు కాగా, ఎ2 సెబాస్టియన్ మాత్రం హాజరు కాలేదు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తగినంత బలం లేకపోయినా అభ్యర్థిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని అప్పట్లో ఏసీబీ వర్గాలు అరెస్టుచేశాయి. తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా ఈ కేసును మళ్లీ విచారిస్తుండటంతో రేవంత్ తదితరులు కోర్టుకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement