ఆవేదనలో.. టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్య | mahipal reddy committs suicide at Professor Jayashankar Telangana State Agricultural University | Sakshi
Sakshi News home page

ఆవేదనలో.. టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్య

Apr 23 2017 9:28 AM | Updated on Nov 6 2018 7:53 PM

ఆవేదనలో.. టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్య - Sakshi

ఆవేదనలో.. టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్య

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ గార్డెన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు

హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ గార్డెన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గార్డెన్‌లో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన వ్యక్తిని ఆదివారం ఉదయం వాకింగ్‌కు వచ్చిన గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తి మైలార్‌దేవ్‌పల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త మహిపాల్‌రెడ్డిగా గుర్తించారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కార్యకర్తలను పట్టించుకోలేదని సూసైడ్‌ నోట్‌లో మహిపాల్‌రెడ్డి పేర్కొన్నాడు. పార్టీలో టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకనైనా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు న్యాయం చేయాలని మహిపాల్‌రెడ్డి సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వాకింగ్‌కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వచ్చి మహిపాల్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులుస పేర‍్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement