ఆల్వాల్ రైల్వే స్టేషన్ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది.
ఆల్వాల్ రైల్వే స్టేషన్ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక వందన డిగ్రీ కాలేజిలో బీకాం సెకండియర్ చదువుతున్న శిరీష, నర్సింగ్ అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ శనివారం మధ్యాహ్నం ఆల్వాల్ రైల్వే స్టేషన్ సమీపంలోని గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో శిరీష అక్కడికక్కడే చనిపోగా నర్సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.