తిరుపతి, శ్రీనగర్‌లకు విమాన ప్యాకేజీలు | IRCTC offers to city tourists by Flight packages Tirupati, Srinagar | Sakshi
Sakshi News home page

తిరుపతి, శ్రీనగర్‌లకు విమాన ప్యాకేజీలు

Jul 8 2016 2:51 AM | Updated on Oct 2 2018 7:43 PM

తిరుపతి, శ్రీనగర్‌లకు విమాన ప్యాకేజీలు - Sakshi

తిరుపతి, శ్రీనగర్‌లకు విమాన ప్యాకేజీలు

నగర పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తిరుపతి, జమ్ము-శ్రీనగర్‌లకు...

ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
సాక్షి, హైదరాబాద్: నగర పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తిరుపతి, జమ్ము-శ్రీనగర్‌లకు విమాన ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నుంచి ఆగస్టు 6, 27 తేదీల్లో రెండు విడతలుగా తిరుపతి బాలాజీ శీఘ్రదర్శనం, ఇదే నెల 13న ఆరు రోజుల జమ్ము, శ్రీనగర్ ప్యాకేజీలను తాజాగా ప్రకటించింది.
 
తిరుపతి ప్యాకేజీ.. ఒకరికి రూ.9,152
మొదటి విడత పర్యటన ఆగస్టు 6న, రెండో విడత 27న ఉంటాయి. ఇందులో భాగంగా ఆయా తేదీల్లో ఉదయం 9.25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.45కు తిరుపతికి చేరుకుంటారు. ఇందులో తిరుమల స్వామివారి శీఘ్ర దర్శనంతో పాటు కాణిపాక దేవాలయం, శ్రీనివాస మండపం సందర్శనలు ఉంటాయి. హోటల్‌లో బస, ఆహార సదుపాయాలన్నీ కల్పిస్తారు. 7న సాయంత్రం 6.25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి 7.40కి హైదరాబాద్ చేరుకుంటారు.  
 
జమ్ము, శ్రీనగర్ ప్యాకేజీ.. ఒకరికి రూ.32,442
5 రాత్రులు, 6 పగళ్లు ఉండే ఈ పర్యటన  ఆగస్టు 13న హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.10కి ఢిల్లీ చేరుకుంటారు. 2.45కు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.15కు శ్రీనగర్ చేరుకుంటారు. తిరుగుప్రయాణంలో 18న మధ్యాహ్నం 12.25కు బయలుదేరి 2 గంటలకు ఢిల్లీకి, అక్కడి నుంచి సాయంత్రం 5.10కి ప్రయాణమై 7.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. శ్రీనగర్‌లో హౌస్‌బోట్, దాల్ సరస్సులో బోట్ రైడింగ్, శంకరాచార్య టెంపుల్, మొఘల్ గార్డెన్స్ సందర్శన తదితర ప్రాంతాలు ఉంటాయి.  అన్ని సదుపాయా లతో ఈ ప్యాకేజీ రూపొందించారు. గ్రూపులో 15 మంది చొప్పున పర్యాటకులు ఉంటారు.  ప్యాకేజీ వివరాలు, బుకింగ్ కోసం 040-23800580, 9701360647 నంబర్లలో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement