హిమాయత్‌సాగర్ జలాశయానికి శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఆడుగుమేర వరద నీరు చేరింది.
పెరిగిన హిమాయత్‌సాగర్ నీటిమట్టం
Oct 9 2016 6:35 PM | Updated on Sep 4 2017 4:48 PM
నార్సింగి: హిమాయత్‌సాగర్ జలాశయానికి శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఆడుగుమేర వరద నీరు చేరింది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద నీరు వాగుగూండా శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 1747.60గా నమోదైంది. గతంలో సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రస్తుతం హిమాయత్‌సాగర్ కళకళలాడుతుంది. ప్రస్తుతం వరద నీటి ప్రవాహం కాస్త తగ్గిందని జలమండలి మెనేజర్ వెంకట్‌రావు తెలిపారు. ఆదివారం ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిస్తే వరద నీరు చేరే అవకాశం ఉందన్నారు.
Advertisement
Advertisement