నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌హైవేపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌హైవేపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఆ కారు ముందు వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వాహనాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనతో ఫ్లైఓవర్‌పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సుమారూ నాలుగు కిలోమీటర్ల మేరా వాహనాలు నిలిచిపోవడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కారణంగానే ఈప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.


