ఆ 'బహుమతి' అపురూపం | Fan gifts a shalw to kcr couple | Sakshi
Sakshi News home page

ఆ 'బహుమతి' అపురూపం

Feb 17 2016 3:39 PM | Updated on Aug 15 2018 9:30 PM

ఆ 'బహుమతి' అపురూపం - Sakshi

ఆ 'బహుమతి' అపురూపం

పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అపురూపమైన బహుమతి లభించింది.

హైదరాబాద్ : పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అపురూపమైన బహుమతి లభించింది. ధర్మవరం పట్టు శాలువా మీద కేసీఆర్ దంపతుల ఫొటోలను చిత్రించిన శాలువాను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎ. జీవన్ రెడ్డి, కేసీఆర్ కు బహుమతిగా ఇచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో తయారుచేయించిన ఈ శాలువాను హైదరాబాద్ తీసుకొచ్చి కేసీఆర్‌కు పుట్టినరోజు సందర్భంగా బహూకరించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అభిమానంతో ఈ శాలువాను ప్రత్యేకంగా తయారుచేయించానని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వివరించారు. నేతలోనే కలిసిపోయిన తమ దంపతుల ఫొటోలు చూసి కేసీఆర్ కూడా సంబరపడ్డారు. ఆ అపురూప కానుకను అందజేసిన ఎమ్మెల్యేను కేసీఆర్ అభినందించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement