సినీహీరో సహా నైజీరియన్ అరెస్ట్ | Drug Rocket gang arrested By hyderabad task Force police | Sakshi
Sakshi News home page

సినీహీరో సహా నైజీరియన్ అరెస్ట్

Mar 24 2014 2:16 PM | Updated on Sep 7 2018 1:59 PM

సినీహీరో సహా  నైజీరియన్ అరెస్ట్ - Sakshi

సినీహీరో సహా నైజీరియన్ అరెస్ట్

హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పాతబస్తీలో సినీ హీరో సహా ఓ నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ : హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టును సౌత్ జోన్ పోలీసులు రట్టు చేశారు. జూబ్లీహిల్స్ లో  సినీ హీరో సహా ఓ నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 16 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. వర్థమాన నటుడు ఉదయ్...పరారే, ఫేస్ బుక్ చిత్రాల్లో నటించినట్లు సమాచారం.

గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ముఠాను  పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరివద్ద నుండి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, విచారణ జరుపుతున్నారు. మరికొద్దిసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా గతంలోనూ పలువురు టాలీవుడ్ నటులు మాదక ద్రవ్యాలతో పట్టుబడిన విషయం తెలిసిందే.  కాగా  పాతబస్తీలో కూడా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement