ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ సెంటర్లు.. | Cyient launches 54 digital centres in Govt schools in Telangana | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ సెంటర్లు..

Aug 29 2016 7:48 PM | Updated on Sep 4 2017 11:26 AM

ఐటీ సంస్థ'సయంట్ డిజిటల్ సెంటర్స్' తెలంగాణలోని ప్రభుత్వపాఠశాలల్లో డిజిటల్ కేంద్రాలు ప్రారంభించింది.

హైదబాబాద్ః తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. ఐటీ సంస్థ.. 'సయంట్ డిజిటల్ సెంటర్స్' (సీడీసీ) ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా సేరిలింగంపల్లి మండలంలోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో  డిజిటల్ కేంద్రాలను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. సీఎస్ఆర్ ఇనీషియేటివ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది.

సయంట్ డిజిటల్ సెంటర్లలో కంప్యూటర్ లేబొరేటరీ, డిజిటల్ లైబ్రరీ, నేషనల్ డిజిటల్ అక్షరాస్యత మిషన్లు పనిచేస్తాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సంఘ సభ్యులకు,  పేద విద్యార్థులకు డిజిటల్ విద్యా వనరులను అందించడమే లక్ష్యంగా ఈ సీడీసీ లు కృషి చేస్తాయని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల్లో ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో సుమారు 20,000 మంది పేద విద్యార్థులకు ప్రత్యేక డిజిటల్ సేవలు అందించనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రతి సెంటర్ నుంచి ఓ కంప్యూటర్ లేదా డిజిటల్ యాక్సెస్ పరికరం వినియోగిస్తూ.. ఇంటర్నెట్ ఉపయోగించడం ద్వారా పరిసర ప్రాంతాల్లోని 1000 మందికి కమ్యూనిటీ సభ్యులు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రత్యేక కార్యక్రమంతో 16 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సున్న మొత్తం 50,000 మంది వరకూ  ప్రయోజనం పొందే అవకాశం ఉన్నట్లు సంస్థ  ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement