కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు ఏడాది పెంపు | communication conistable candidates age relaxation for 1 year | Sakshi
Sakshi News home page

కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు ఏడాది పెంపు

Mar 3 2016 8:33 PM | Updated on Apr 3 2019 9:27 PM

పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ విభాగపు అభ్యర్థుల వయో పరిమితిని మరో ఏడాది పెంచుతూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసింది.

హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ విభాగపు అభ్యర్థుల వయో పరిమితిని మరో ఏడాది పెంచుతూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే మూడేళ్లు వయోపరిమితి సడలించిన ప్రభుత్వం తాజాగా మరో ఏడాది పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఇదివరకే సబ్‌ఇన్‌స్పెక్టర్ల వయోపరిమితి ఏడాది పాటు పెంచిన నేపథ్యంలో కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల విషయంలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో కమ్యూనికేషన్ విభాగంలోని 332 కానిస్టేబుల్ పోస్టులకు జనరల్ కేటగిరిలో 26 ఏళ్ల వయస్సున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మిగతా విభాగాల వారికి వయస్సు మినహాయింపులు ఇచ్చారు. ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement