గ్రేటర్ బరిలో తోడికోడళ్లు | co-sisters in GHMC Elections from erragadda division | Sakshi
Sakshi News home page

గ్రేటర్ బరిలో తోడికోడళ్లు

Jan 17 2016 8:15 PM | Updated on Aug 10 2018 8:16 PM

గ్రేటర్ బరిలో తోడికోడళ్లు - Sakshi

గ్రేటర్ బరిలో తోడికోడళ్లు

జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇక అభ్యర్థులు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో దూసుకుపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇక అభ్యర్థులు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో దూసుకుపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఎర్రగడ్డ డివిజన్ అనూహ్య పోటీకి సిద్ధమైంది. ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల నుంచి తోడికోడళ్లు తలపడనున్నారు. 

టీఆర్‌ఎస్ పార్టీ తరపున కంజర్ల సదాశివ యాదవ్ భార్య కంజర్ల అన్నపూర్ణ పోటీ చేస్తుండగా, టీడీపీ అభ్యర్ధిగా కంజర్ల శ్రీనివాస్ యాదవ్ భార్య జయశ్రీ పోటీ చేయనున్నారు. ఇద్దరూ ఒకే డివిజన్‌ నుంచి ఆదివారం నామినేషన్లు వేర్వేరు పార్టీల తరపున దాఖలు చేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమానికి అన్నదమ్ములు సదాశివ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ ఇద్దరూ హాజరయ్యారు. గెలుపుపై ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకా ఈ తోడికోడళ్లలో ఎవరు విజయం సాధిస్తారోనని గ్రేటర్లో ఆసక్తి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement