రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై మాత్రమే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనా ఎదురుదాడి చేయాల్సిందేనని టీపీసీసీ నిర్ణయించింది.
టీపీసీసీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై మాత్రమే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనా ఎదురుదాడి చేయాల్సిందేనని టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్యు లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో సోమవారం సమా వేశం జరిగింది. ఎస్సీ సెల్ జాతీయ నాయకుడు ప్రసాద్, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన, ప్రభావం, జూన్ 1న సంగారెడ్డిలో నిర్వహించనున్న తెలంగాణ ప్రజాగర్జన, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై అనుసరించాల్సిన వ్యూహం వంటివాటిపై ఈ సమావేశంలో చర్చించారు. బీజేపీ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించిన నేపథ్యం లో ఆ పార్టీ వ్యవహారాలను నిశితంగా పరిశీలించాలని, ఎప్పటికప్పుడు స్పం దించాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు. సంగారెడ్డి సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లపై చార్జీషీట్ విడుదల చేస్తామని తెలిపారు.