తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ హవా | ap students grab more number of ranks in ts eamcet | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ హవా

May 26 2016 2:51 PM | Updated on Aug 18 2018 8:53 PM

తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ హవా - Sakshi

తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ హవా

ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు టాప్ 10 ర్యాంకులలో ఎక్కువ ర్యాంకులు సంపాదించగా, ఇప్పుడు తెలంగాణ ఎంసెట్‌ ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకులలో ఆరు ర్యాంకులను ఏపీ విద్యార్థులు కైవసం చేసుకున్నారు.

ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులు టాప్ 10 ర్యాంకులలో ఎక్కువ ర్యాంకులు సంపాదించగా, ఇప్పుడు తెలంగాణ ఎంసెట్‌ ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకులలో ఆరు ర్యాంకులను ఏపీ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. మొదటి నాలుగు ర్యాంకులు హైదరాబాద్‌లో చదివిన విద్యార్థులకు రాగా, ఐదు నుంచి పది వరకు.. అంటే ఆరు ర్యాంకులు ఏపీ విద్యార్థులకు వచ్చాయి.

ఐదోర్యాంకు పొందిన రాహల్ (గుంటూరు), ఆరో ర్యాంకర్ వెంకట సాయి గణేశ్ (గుంటూరు), ఏడో ర్యాంకర్ తన్మయి (విజయనగర), ఎనిమిదో ర్యాంకర్ గౌతమ్ (పశ్చిమగోదావరి), తొమ్మిదో ర్యాంకర్ జయకృష్ణ సాయి వినయ్ (గుంటూరు), పదో ర్యాంకర్ వంశీకృష్ణారెడ్డి (విశాఖపట్నం).. అందరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. మొదటి నాలుగు ర్యాంకులు పొందినవారు హైదరాబాద్‌లోని మాదాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాలకు చెందినవారు. తెలంగాణలోని ఇతర జిల్లాల విద్యార్థులకు టాప్ 10 ర్యాంకులలో స్థానం దక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement