చిరంజీవిని కలిసిన ఏపీ మంత్రులు | andhra pradesh ministers met chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరంజీవిని కలిసిన ఏపీ మంత్రులు

Oct 17 2015 6:40 PM | Updated on Aug 18 2018 5:48 PM

చిరంజీవిని కలిసిన ఏపీ మంత్రులు - Sakshi

చిరంజీవిని కలిసిన ఏపీ మంత్రులు

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు.

హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్ శనివారం చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా రాజధాని శంకుస్థాపనకు చిరంజీవిని ఆహ్వానించారు.

ఈ నెల 22న అమరావతి శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే.   సమయం దగ్గర పడుతున్నందున ఈ ఆహ్వాన కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు వేగవంతం చేశారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అపాయింట్మెంట్ కోరిన చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం ఆయనతో భేటీ కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement