కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ‘పుట్టిన 48 గంటల్లోనే ఆధార్ కార్డు’ సౌకర్యం ఆగస్ట్ 1 నుంచి రాష్ట్రంలో ప్రారంభం కానుంది.
తొలుత రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఆస్పత్రుల్లో అమలు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ‘పుట్టిన 48 గంటల్లోనే ఆధార్ కార్డు’ సౌకర్యం ఆగస్ట్ 1 నుంచి రాష్ట్రంలో ప్రారంభం కానుంది. తొలుత ఐదు ఆస్పత్రుల్లోనే దీనిని చేపడుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో విశాఖలోని విక్టోరియా జనరల్ ఆస్పత్రి, గుంటూరు, నెల్లూరు, విజయవాడల్లోని ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రులు, తిరుపతిలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఉన్నాయి.
ఈ ఐదు ఆస్పత్రుల్లోనూ పుట్టిన వెంటనే బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ నంబర్‌ను కేటాయిస్తారు. దీనిని తల్లి ఆధార్ నంబర్‌తో అనుసంధానిస్తారు. అనంతరం నెలలోగా కార్డు అందజేస్తారు. కాగా, బిడ్డకు పేరు లేకపోయినా బేబీ ఆఫ్ అని తల్లి, తండ్రి పేర్లు రాసి వీటిని ఇస్తారు. పేరు పెట్టాక దీనిని తిరిగి మార్చుకునే వీలుంటుంది.