సుప్రీంకోర్టు ఆదేశాలతో 2011 గ్రూప్-1 మెయిన్స్ మళ్లీ నిర్వహించేందుకు ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ మార్పు చేసింది.
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాలతో 2011 గ్రూప్-1 మెయిన్స్ మళ్లీ నిర్వహించేందుకు ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ మార్పు చేసింది. ఈపరీక్షలను సెప్టెంబర్ 6నుంచి 17వ తే దీ వరకు నిర్వహించనున్నట్లు ఇది వరకు ప్రకటించింది. తాజాగా ఆ షెడ్యూల్‌ను మార్పు చేస్తూ కొత్త ప్రకటనను తన వెబ్‌సైట్లో పొందుపరిచింది. సెప్టెంబర్ 13 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇదే తేదీల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ఈ మెయిన్స్ పరీక్షను రెండు రాష్ట్రాల్లో కూడా రాయాలనుకొనే వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.