కరెంటు షాక్ తగిలి కార్మికుడి మృతి | Worker killed off the electric shock | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్ తగిలి కార్మికుడి మృతి

Feb 22 2016 12:59 PM | Updated on Oct 20 2018 6:04 PM

తోటపల్లి గూడూరు మండలం అనంతపురం గ్రామంలో ఉన్న ఎంసీసీటీపీఎల్ పవర్ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి మున్నా యాదవ్(32) అనే కార్మికుడు మరణించాడు.

తోటపల్లి గూడూరు మండలం అనంతపురం గ్రామంలో ఉన్న ఎంసీసీటీపీఎల్ పవర్ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి మున్నా యాదవ్(32) అనే కార్మికుడు మరణించాడు. ఈ సంఘటన ఆదివారం జరిగినా సోమవారం వరకూ గోప్యంగా ఉంచారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే యాదవ్ మరణించాడని బంధువులు, కార్మికులతో కలిసి ఆందోళనకు దిగారు.

పవర్ ప్రాజెక్టు ఎదుట కాపలా కాస్తున్న ఎస్‌పీఎఫ్ కానిస్టేబుళ్లకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పరస్పరం దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. కార్మికులు 6 బైక్‌లకు నిప్పుపెట్టి మరో 6 బైక్‌లను ధ్వంసం చేశారు. గేటు దగ్గర ఉన్న ఔట్‌పోస్టును కూడా ధ్వంసం చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement