బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి | The young man killed in road accident | Sakshi
Sakshi News home page

బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

Feb 17 2016 3:23 PM | Updated on Aug 30 2018 3:58 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పోశెట్టిగూడ సమీపంలో బైక్ అదుపుతప్పడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పోశెట్టిగూడ సమీపంలో బైక్ అదుపుతప్పడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. రెండు రోజుల క్రితం ప్రమాదం జరగ్గా విషయం ఆలశ్యంగా వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా గుడ్లూరుకు చెందిన సురేష్ అలియాస్ ఏసు (22)మేస్త్రీ పని చేస్తూ మహేశ్వరం మండలం రావిరాలలో నివాసం ఉంటున్నాడు.

ఈ నెల 15న రావిరాల నుంచి పటాన్‌చెరు సమీపంలోని రామచంద్రాపురానికి బైక్‌పై వెళుతున్నాడు. శంషాబాద్ మండలం పోశెట్టిగూడ వద్ద అవుటర్ రింగ్‌రోడ్డు నుంచి సర్వీసు రోడ్డులోని గుంతలోకి అతడి బైక్ పల్టీ కొట్టింది. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, సర్వీసు రోడ్డు వినియోగంలో లేకపోవడంతో... ప్రమాదం విషయం బయటకు రాలేదు. బుధవారం కొందరు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement