కన్నతండ్రిపై కొడవలితో దాడి | son attacks his father in adilabad | Sakshi
Sakshi News home page

కన్నతండ్రిపై కొడవలితో దాడి

Oct 28 2015 11:22 AM | Updated on Sep 2 2018 4:37 PM

కన్నతండ్రిపై కొడుకు కొడవలితో దాడి చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తన భార్యతో జరిగిన గొడవలో జోక్యం చేసుకున్నాడని తండ్రిపై దాడి చేశాడు.

ఆదిలాబాద్: కన్నతండ్రిపై కొడుకు కొడవలితో దాడి చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తన భార్యతో జరిగిన గొడవలో జోక్యం చేసుకున్నాడని తండ్రిపై దాడికి దిగాడు.


దండేపల్లి మండలం ద్వారక గ్రామానికి చెందిన బాణయ్య తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. బాణయ్యకు అతని భార్యతో బుధవారం ఉదయం గొడవ జరిగింది. దీంతో గొడవ వద్దంటూ బాణయ్యకు తండ్రి పోచయ్య నచ్చజెప్పబోయాడు. ఆగ్రహించిన కుమారుడు తండ్రిపై కొడవలితో దాడి చేశాడు. గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement