ఈ-బిడ్డింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా హిందూపురంలో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు.
హిందూపురం: ఈ-బిడ్డింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా హిందూపురంలో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం మధ్యాహ్నం అయినా ఒక్క లావాదేవీ కూడా పూర్తి చేయలేదని, ఈ-బిడ్డింగ్ పద్ధతి వద్దంటూ ఎండుమిర్చి రైతులు ఆందోళనకు దిగారు. కమిటీ యార్డు కార్యదర్శి కార్యాలయం ముందు బైటాయించారు. కార్యాలయంలో ఉన్న కరపత్రాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను చించివేశారు. మునుపటి మాదిరిగానే వేలం పాట పెడతామని అధికారులు చెప్పినా రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులు రైతులను అడ్డుకోవడంతొ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.